నువ్వే
ఎవరి యుద్ధం వాళ్ళే చెయ్యాలి
నీ యుద్ధం నువ్వే గెలవాలి
నీ రక్తంతో నీ మూలిగతో
నీ కత్తీ డాలూ నువ్వే చెసుకోవాలి
అసలు అధర్మం
నీ యుద్ధం ఎవరైనా చేయడమే
అసలు అన్యాయం
నీ కత్తీ డాలూ ఎవరయినా చేసివ్వడమే
ఎప్పుడూ నీ యుద్ధం ఎవరెవరో చేశారు
నిన్ను బతిమాలి
నీ తరుపున యుద్ధతంత్రం రచించారు
నిన్ను గుండెల మీదికి లాక్కుని
నీ కోసం తత్వం రచించారు
నిన్ను బెదిరించి
నీ కోసం శస్త్రధారులయ్యారు.
ఓడినా సరే
ఎవరి యుద్ధం వాళ్ళే చెయ్యాలి
నీ కోసం వాళ్ళు యుద్ధం గెలిచారో
నిలువునా మునిగిపొతావు
ఎప్పటికీ ఓడిపోతావు.
- సుధ
నా అనువాదం.
ఈ కవిత మునుముందు అంధ్రజ్యొత్తి దినపత్రికలో ముద్రింపబడింది. నేను చదివింది ఓల్గా చేకూర్చిన స్త్రీవాద కవితా సంకలనంలో. (నీలి మేఘాలు. స్త్రీవాద కవితా సంకలనం. స్వేచ్చ ప్రచురణలు. హైదరాబాదు: 1993)
| CARVIEW |
Select Language
HTTP/2 200
content-type: text/html; charset=UTF-8
expires: Fri, 23 Jan 2026 23:41:42 GMT
date: Fri, 23 Jan 2026 23:41:42 GMT
cache-control: private, max-age=0
last-modified: Fri, 18 Oct 2024 06:30:32 GMT
etag: W/"f4d0be751488e49ad28e3accaa76760a540aaa4c06cafa7e9f4c73987c1b54e5"
content-encoding: gzip
x-content-type-options: nosniff
x-xss-protection: 1; mode=block
content-length: 9232
server: GSE
alt-svc: h3=":443"; ma=2592000,h3-29=":443"; ma=2592000
ఆదిమానవి
skip to main |
skip to sidebar
ఆదిమానవి
Friday, October 30, 2009
Saturday, October 17, 2009
ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
జయప్రభ నాకు అత్యంత ఇష్టమైన కవి, అందులోనూ ఈ కవిత్వమంటే బాగా ఇష్టం నాకు. పద్యం టైటిల్లోనే ఆలోచింపచేసే కొణాలెన్నున్నాయో!!
సరిహద్దులు గీసుకున్నవి
మనుష్యుల స్వార్ధాలుగాని
దూకే సెలయ్యెళ్హు కావు
అడవులూ జలపాతాలూ కావు
ఇక్కడ కురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగల వాళ్హుంటే రండి!
భూమి విశ్వరూపాన్ని
ముక్క చెక్కలు చేస్తున్నవి
మతాలు మంత్రాంగాలూనూ.
నిజంగా సరిహద్దులు చేరిపేయగలిగితే
ప్రపంచానికి
నేలా నీరు గాలి అందరివీగాని
ఏడు ఖండాలుగా విడిపోయిలేవు.
- జయప్రభ
(మూలము: ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది? జయప్రభ పద్యాలు. చైతన్యతేజ పబ్లికేషన్స్. హైదరాబాద్: ౧౯౯౧.)
సరిహద్దులు గీసుకున్నవి
మనుష్యుల స్వార్ధాలుగాని
దూకే సెలయ్యెళ్హు కావు
అడవులూ జలపాతాలూ కావు
ఇక్కడ కురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగల వాళ్హుంటే రండి!
భూమి విశ్వరూపాన్ని
ముక్క చెక్కలు చేస్తున్నవి
మతాలు మంత్రాంగాలూనూ.
నిజంగా సరిహద్దులు చేరిపేయగలిగితే
ప్రపంచానికి
నేలా నీరు గాలి అందరివీగాని
ఏడు ఖండాలుగా విడిపోయిలేవు.
- జయప్రభ
(మూలము: ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది? జయప్రభ పద్యాలు. చైతన్యతేజ పబ్లికేషన్స్. హైదరాబాద్: ౧౯౯౧.)
Friday, October 16, 2009
తొలిపలుకు
చాలా కాలం తరువాత తెలుగులో వ్రాస్తున్నాను. కాస్త ఉద్రేకంగా, కాస్త ఆందోళనగా ఉంది! తప్పులు ఉంటాయేమోనని!
దేని గురించి వ్రాయాలి? అఫ్ కోసే, నా గురించే ...'నా' అంటే?
స్త్రీ. ఆడది. ప్రపంచంలో సగం. చాప కింద నీరు. గయ్యాళి. ఆకసంలో సగం. తల్లి. ఊసరవెల్లి?
కవిత్వం. నాకు నచ్హిన కవిత్వం. స్త్రీవాద కవిత్వం.
నాకు నచ్హిన కవిత్వములను, కవయిత్రులు గురించి ఈ బ్లాగ్. వీలయితే, చేతనయితే, అనువాదాలు.
దేని గురించి వ్రాయాలి? అఫ్ కోసే, నా గురించే ...'నా' అంటే?
స్త్రీ. ఆడది. ప్రపంచంలో సగం. చాప కింద నీరు. గయ్యాళి. ఆకసంలో సగం. తల్లి. ఊసరవెల్లి?
కవిత్వం. నాకు నచ్హిన కవిత్వం. స్త్రీవాద కవిత్వం.
నాకు నచ్హిన కవిత్వములను, కవయిత్రులు గురించి ఈ బ్లాగ్. వీలయితే, చేతనయితే, అనువాదాలు.
Subscribe to:
Comments (Atom)
